DNB News - ఆంధ్రప్రదేశ్ / : హొళగుంద మండలంలోని హెబ్బటం గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరియు సవారమ్మ ముఖద్వారం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా డి.ఎస్.పి వెంకటరామయ్య, ఆదోని మాజీ ఎంపీపీ పంపాపతి, దేవరగట్టు చైర్మన్ కురువ వీర నాగప్ప, విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు మరియు వాల్మీకి పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు వాల్మీకి మహర్షి ఆశయాలను స్మరించుకుంటూ, గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
DNB News