Sunday, 02 August 2026 09:53:35 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఎమ్మెల్యే పార్థసారధిపై లంచం ఆరోపణలపై విచారణ జరపాలి – నూర్ అహ్మద్ డిమాండ్..

Date : 08 April 2026 05:18 PM Views : 211

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధిపై వచ్చిన యాభై లక్షల రూపాయల లంచం ఆరోపణలపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు వెలికితీయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదోని ఇన్చార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ కి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం మరింత ముదిరితే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన హెచ్చరించారు. పరిస్థితి అదుపు తప్పకముందే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి సొంత స్థలం సమీపంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతుల విషయంలో ఎమ్మెల్యే యాభై లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారని టిడిపి నాయకుడు సౌదీ గుజిరి రౌఫ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌదీ రౌఫ్ మరియు ఎమ్మెల్యే పార్థసారధి ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించి నిజమైన నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రాత్మక ఆదోని షాహీ జామియా మసీదు నిర్వహణలో జరుగుతున్న ఆలస్యాలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మసీదు బైలాస్ ప్రకారం ఎన్నికలు నిర్వహించి అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని కోరారు. ప్రస్తుత ముతవల్లి సౌదీ రౌఫ్ పదవీకాలం ముగిసి ఆరు సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోవడం విచారకరమని తెలిపారు. సౌదీ రౌఫ్ మరియు వక్ఫ్ బోర్డు పరస్పరం చర్చించి కేసులను వెనక్కి తీసుకుని త్వరితగతిన ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: