Thursday, 17 September 2026 05:54:07 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి: ఏఐటీయూసీ ధర్నా..

Date : 19 May 2026 10:19 AM Views : 85

DNB News - ఆంధ్రప్రదేశ్ / : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమవారం చందన బ్రదర్ సర్కిల్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ పట్టణ ప్రధాన కార్యదర్శి వై.టి. భీమరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ సీనియర్ నాయకులు కె. అజయ్ బాబు, రాష్ట్ర సమితి సభ్యులు ఓబి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం తీవ్రంగా ఖండనీయమన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యులు, దినసరి కూలీలు, మధ్యతరగతి ప్రజలపై ఈ ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు. చమురు ధరల పెంపు ప్రభావం రవాణా చార్జీలపై పడుతూ, కూరగాయలు, పప్పుదినుసులు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి కారణమవుతోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా ప్రజలకు ఉపశమనం కల్పించకుండా ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ రూపంలో అధిక పన్నులు విధిస్తున్నాయని విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, చమురు ఉత్పత్తులపై విధిస్తున్న అధిక పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి ధరలను తగ్గించకపోతే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు బి. ఎంకన్న, కల్లుబావి రాజు, ఈరన్న, రాజేష్, దేవా, నరసింహులు, వీరేష్‌తో పాటు హమాలి, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: