Sunday, 02 August 2026 11:18:11 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

సాయిప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే పార్థసారథి బహిరంగ సవాల్..

Date : 13 March 2026 09:42 AM Views : 142

DNB News - ఆంధ్రప్రదేశ్ / : సర్వే నెంబర్ 630లో 3.34 ఎకరాల భూమి ఆక్రమణపై క్షేత్రస్థాయి పరిశీలన – ఆధారాలు బయటపెడతామన్న ఎమ్మెల్యే.. ఆదోని గడ్డపై రాజకీయ పోరు మరోసారి ముదిరింది. భూ ఆక్రమణల విషయంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి క్షేత్రస్థాయిలో ఆధారాలతో సహా స్పందించారు. గురువారం మండలంలోని సర్వే నెంబర్ 630లో 3.34 ఎకరాల దారి పరంపోగు భూమి ఆక్రమణపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోనిని సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. 2019 నుండి 2024 వరకు ఆదోని నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన భూ కబ్జాలను దశలవారీగా బట్టబయలు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్వే నెంబర్ 630 వివాదం: సర్వే నెంబర్ 630లో సుమారు 3.34 ఎకరాల భూమిని వైసీపీ అనుచరులు కబ్జా చేశారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. దోషులను బయటపెడతాం: ప్రజల ఆస్తులను ఆక్రమించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని, ఆక్రమణదారులను ప్రజల ముందే దోషులుగా నిలబెట్టడం ఖాయమని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేకు చురకలు: మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని ఉద్దేశిస్తూ “వయసు పైబడింది… హరే రామ, హరే కృష్ణ అంటూ ఇంట్లో పిల్లలతో గడుపుతూ విశ్రాంతి తీసుకోవడం మంచిది. రాజకీయాలు మాకు వదిలేయండి” అంటూ ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యానించారు. అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన: కేవలం మాటలకే పరిమితం కాకుండా రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే వివాదాస్పద భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషపణి, వీఆర్వోలు రాజశేఖర్ గౌడ్, ఈరన్న, సర్వేయర్ హరికృష్ణ, ఆర్‌ఐ లక్ష్మన్నతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: