DNB News - ఆంధ్రప్రదేశ్ / : దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ప్రత్యేక కమిటీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కి న్యూడిల్లీలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ' పద్మశ్రీ ' మందకృష్ణ మాదిగ తన నివేదికను సమర్పించడం జరిగింది. 200 పైగా పేజీలతో కూడిన ఈ నివేదికలో దళిత క్రైస్తవులకు సంబంధించిన విద్యా,వైద్య, సామాజిక ,సాంస్కృతిక , ఆర్థిక పరిస్థితులను పేర్కొంటూ వారికి ఎస్సీ హోదా మరియు రాజ్యాంగ హక్కులను కల్పించాలని కమిటీకి MRPS తరుపున విజ్ఞప్తి చేశారు. అలాగే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు మరియు సామాజిక వివక్షత , రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఇతర అంశాలు ,కుల వ్యవస్థ ప్రభావం మొదలగు అంశాలను ఈ నివేదికలో పొందుపరిచి సుదీర్ఘ కాలంగా నలుగుతున్న సమస్య పరిష్కారం కోసం కమిటీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టడం జరిగింది.
Admin
DNB News