DNB News - ఆంధ్రప్రదేశ్ / : బీజేపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కమ్మరి పద్మావతిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి ఉదయం నుంచి రాత్రి 7.30 గంటల వరకు పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడం తీవ్రంగా ఖండనీయమని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ కోతుల బావి కారసేవ కార్యక్రమంలో పాల్గొనరాదని పేర్కొంటూ పద్మావతి చేత సెల్ఫ్ బాండ్‌పై సంతకం తీసుకున్నప్పటికీ, అవసర నిమిత్తం బయటికి వచ్చిన ఆమెను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అరెస్ట్ చేసిన కారణాలు స్పష్టంగా తెలియజేయకుండా గంటల తరబడి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. మహిళా నాయకురాలిపై ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని, బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ శాంతియుతంగా కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు ఉందని, రాజకీయ కక్షసాధింపులతో పోలీసులను ఉపయోగించడం తగదని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
Admin
DNB News