DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిపై దాడి చేస్తామని సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడిన వైసీపీ కార్యకర్తను తక్షణమే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని MHPS రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ మరియు ఆదోని డీఎస్పీకి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి బెదిరింపులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన హెచ్చరించారు. వివిధ అంశాల్లో తాము ఎమ్మెల్యే పార్థసారధిని వ్యతిరేకించినప్పటికీ, ఈ విషయంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఎమ్మెల్యేకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా, ఈ దుర్మార్గపు వ్యాఖ్యలను ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాదరెడ్డి మరియు ఆయన కుమారుడు మనోజ్ రెడ్డి ఖండించాలని ఆయన కోరారు. వారు ఖండించకపోతే ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలకు వారి మద్దతు ఉన్నట్లు ప్రజలు భావించే అవకాశముందని నూర్ అహ్మద్ తెలిపారు.
Admin
DNB News