DNB News - ఆంధ్రప్రదేశ్ / : విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ...కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి మొత్తం 65 ఫిర్యాదులు అందాయి. ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, చట్టప్రకారం విచారణ జరిపి పరిష్కరించాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. కర్నూలు కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈరోజు కార్యక్రమానికి వచ్చిన ముఖ్య ఫిర్యాదుల్లో కొన్ని: కల్లూరు పరిధిలో తన భార్య పేరిట ఉన్న ఒక ఎకరా పొలాన్ని కొంతమంది ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూ దాడులకు యత్నిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని శిల్పా నందవనం, కర్నూలుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి భక్త వత్సలం ఫిర్యాదు చేశారు. తెలంగాణ హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గట్టి సుధాకర్ అలియాస్ డేవిడ్ రూ.2 లక్షలు తీసుకుని మోసం చేశాడని వెంకన్న బావి, బాలాజీ విలాస్, కర్నూలుకు చెందిన భాస్కర్ నాయక్ ఫిర్యాదు చేశారు. సిబిల్ స్కోర్ చెక్ చేస్తామని చెప్పి డాక్యుమెంట్లు తీసుకుని సంతకం ఫోర్జరీ చేసి, శ్రీరామ్ ఫైనాన్స్ నుండి నోటీసులు పంపించి మోసం చేశారని వీకర్ సెక్షన్ కాలనీ, కర్నూలుకు చెందిన మల్లికార్జున ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రూ.25 లక్షలు ఇచ్చానని, తిరిగి ఇవ్వాలని రౌడీ మూకలతో బెదిరిస్తున్నారని ఎన్ఆర్ పేట, కర్నూలుకు చెందిన పారిక్ ఫిర్యాదు చేశారు. DHANI LOANS లో తన పాన్ కార్డు నంబర్ ఉపయోగించి లోన్ తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి గూడూరు కు చెందిన సుధాకర్ రూ.2 లక్షలు తీసుకుని మోసం చేశాడని నాగప్ప వీధి, కర్నూలుకు చెందిన రవిశంకర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ హుస్సేన్ పీరా , సిఐలు మన్సరుద్దీన్ మరియు విజయలక్ష్మి పాల్గొన్నారు.
Admin
DNB News