DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగర శివారులోని గార్గేయపురం డంపింగ్ యార్డ్‌లో చెత్తను శాస్త్రీయ విధానంలో డీ-కంపోజ్ చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ అమలు చేస్తున్న వ్యర్థ నిర్వహణ విధానాలను, చెత్త వర్గీకరణ, ప్రాసెసింగ్ విధానాలను సమగ్రంగా తెలుసుకున్నారు. చెత్తను శాస్త్రీయంగా డీ-కంపోజ్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు, దుర్వాసనలు మరియు కాలుష్యాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్‌లో పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు అధికారులకు అందజేశారు. నగర పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వ్యర్థ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News