DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్ర మాజీ మంత్రి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పి యూ సి సభ్యులు అంబటి రాంబాబు పై టీడీపీ రౌడీ మూకలు హత్యా యత్నం చేయడన్ని ఖండిస్తూ ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు & వైసీపీ ఇంచార్జ్ గొర్లె కిరణ్ కుమార్ వారి కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశం లో వారు మాట్లాడుతూ రాష్ట్రం లో శాంతి బధ్రతలు పూర్తిగా దారితప్పాయ్యని పోలీస్ లు అంబటి పై దాడి జరుగుతుంటే చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారని చంద్రబాబు నాయకత్వం లో రాష్ట్రం లో జంగిల్ రాజ్యం నడుస్తుందని అన్నారు, కాపులు రాష్ట్ర స్థాయిలో ఎదగడాన్ని చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని, వైసీపీ తరఫున ప్రజా గొంతుకుగా ప్రతిపక్షం తరఫున అంబటి తన వాణి గట్టిగా వినిపించడం తో చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని అన్నారు, కాపుల పై చంద్రబాబు పగ ఈనాటి ది కాదని ఆనాడు వంగవీటి తో మొదలపెట్టి, ముద్రగడ పద్మానాభమ్, అంబటి వంటి ప్రజాధారణ గల నాయకులు పై తన దాస్టీకాన్ని చూపిస్తున్నారని అన్నారు, కాపు కుర్రాణ్ణి 6 నెలలు క్రితం కూటమి నాయకుడు కారు తో తొక్కించి హత్య చేశారని, ఈ రోజు రాజకీయ విమర్శలు తట్టుకోలేక అంబటి ని చంపాలని చూశారని కాపులు పై జరుగుతున్న దాడుల పై కాపుల ఓట్లు తో డీసీఎం అయిన కూటమి లో ఉన్న పవన్కళ్యాణ్ తన స్టాండ్ తెలియజేయాలని అన్నారు, కాపులు తిరగబడి తన సత్తా చాటడానికి సిద్ధం గా ఉన్నారని చంద్రబాబు కి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో రణస్థలం వైసీపీ అధ్యక్షులు గొర్లె శ్రీనివాస్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు మజ్జి రమేష్, ఎచ్చెర్ల మండల వైసీపీ జనరల్ సెక్రటరీ దుంప ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News