Saturday, 01 August 2026 08:04:17 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి – 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి..

Date : 02 February 2026 04:41 PM Views : 107

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదోని పట్టణంలోని రెవెన్యూ భవన్‌లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీఎస్ గోపాల్, బి. వెంకన్న, జి.ఎం.కప్ప అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి. అంజిబాబు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే. అజయ్ బాబు, ఐఎన్‌టీయూ నాయకులు దేవి శెట్టి ప్రకాష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే. వెంకటేశులు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మల్లికార్జున తదితరులు పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగం, హమాలీ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు జీవన భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడుల ఉపసంహరణను తక్షణమే నిలిపివేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు. ఈ డిమాండ్స్ సాధనకై దేశవ్యాప్తంగా 12వ తేదీన జరగనున్న సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని ఐక్యంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు సంజయ్, డిఎస్ఎఫ్ నాయకులు ఉదయ్, సిఐటియు నాయకులు తిప్పన, లక్ష్మన్న, హనుమంతు, కృష్ణమూర్తి, ఏఐటీయూసీ నాయకులు ఓబి నాగరాజు, బి. రాజు, భీమేష్, గంగన్న, ఐఎఫ్‌టీయూ నాయకులు నరసన్న తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :