Sunday, 01 November 2026 05:51:03 AM
# ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!! # ఒక వ్యక్తి ఖాతాలోకి ₹1,00,00,00,00,000..ట్విస్ట్..!! # హైదరాబాద్ లో వర్షం.. నాలాలో పడిన డెలివరీ బాయ్..!! # శబరిమల భక్తులకు రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్..!! # పోలీస్ సంక్షేమ నిధుల దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్..!! # సూపర్ ఎల్నినో.. నేడు హైదరాబాద్లో కీలక సదస్సు..!! # బాలికపై తండ్రి దాడి..ఆటోనగర్ లోని కృష్ణారెడ్డి నగర్ లో తండ్రి చేతిలో గాయపడ్డ కూతురు లక్ష్మీ ప్రణీత (16)..!! # పటాన్చెరు PS నుంచి నిందితుల పరారీ..? # మీర్పేట్ కానిస్టేబుల్ అరెస్ట్..!! # జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం

ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్!

Date : 01 September 2026 04:37 PM Views : 92

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంజాయి సేవిస్తున్న వారి సమాచారం ఇస్తే రూ. 1,500 బహుమతిని అందిస్తారు. డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణా వివరాలు అందిస్తే రూ. 5,000 రివార్డు ఉంటుంది అని సీపీ రాజశేఖర్ బాబు ప్రకటించారు. ఈ ప్రయత్నంలో ఈగల్ బృందం కూడా పోలీసులతో కలిసి పని చేస్తుంది ఇప్పటికే 1,287 మందిని గుర్తించిన పోలీసులు, యువతను రక్షించే లక్ష్యంతో మత్తు రహిత సమాజం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని దళారులు, వ్యాపారస్తులు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారని గుర్తించిన నేపథ్యంలో, ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెంచనున్నారు. మత్తు పదార్థాల విక్రేతలకు జైలు తప్పదని పోలీసులు హెచ్చరిస్తూ, యువత మంచి బాట పట్టాలని హితవు పలికారు. మత్తు రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :