Thursday, 17 September 2026 02:08:16 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఆదోని జిల్లా కోసం పోరాటం ఉధృతం – 127వ రోజు కుటుంబ సమేతంగా నిరాహార దీక్ష… రాజకీయ పార్టీలపై తీవ్ర విమర్శలు..

Date : 23 March 2026 10:39 AM Views : 120

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని జిల్లా సాధన కోసం కొనసాగుతున్న ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. 127వ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా పగడాల కోదండ కుటుంబ సమేతంగా దీక్షలో కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు పగడాల రమేష్ మాట్లాడుతూ – గతంలో కుటుంబ సమేతంగా దీక్షలో కూర్చుంటామని చెప్పిన నాయకులు ఇప్పుడు కనిపించకపోవడం బాధాకరమని విమర్శించారు. కర్నూలు పశ్చిమ ప్రాంతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అధిక జనాభా ఉన్న ప్రాంతం అయినప్పటికీ అభివృద్ధిలో వెనుకబడి ఉందని, ప్రజల ఆశయమే ఆదోని జిల్లా సాధన అని తెలిపారు. 127వ రోజు దీక్షకు సంఘీభావం తెలపడానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, సిపిఐ నాయకుడు వీరేష్, బీజేపీ నాయకులు రమేష్ యాదవ్, పగడాల కిరణ్, విద్యార్థి నాయకుడు నాగరాజ్, ఎమ్మార్పీఎస్ నాయకుడు బండారి హనుమంతు, దాసరి నరేష్ తదితరులు హాజరై తమ మద్దతు తెలిపారు. ఆదోని జిల్లా ప్రకటించే వరకు పోరాటాన్ని కొనసాగించాలని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఇప్పటికే పట్టణ బంద్‌లు, ఐదు నియోజకవర్గాల బంద్‌లు, వంటవార్పు, పాదయాత్రలు, బైక్ యాత్రలు, నాయకుల ఇళ్ల ముట్టడులు నిర్వహించినప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఎలాంటి స్పందన లేకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ప్రజల ఓట్లతో పదవులు పొందిన నాయకులు, ప్రజలకు అవసరమైన నీరు, వైద్యం, విద్య, ఉపాధి, రవాణా వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు మేలుకొని ఆదోని జిల్లా ఉద్యమానికి మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ఈరోజు దీక్షలో పగడాల కోదండతో పాటు పగడాల జానకమ్మ, అనిల్ కుమార్, శైలజమ్మ, మమత, భాగ్యశ్రీ, సాయి పల్లవి, అనిత్య, ఈశా తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, రామాంజనేయులు, వైపీ నాగరాజు, సుగుణమ్మ, గోవిందరాజులు, హైకోర్టు న్యాయవాది బి. రామాంజనేయులు, బీఎస్పీ నాయకుడు రామలింగయ్య, గుమ్మాల బాలస్వామి, జగన్, నరేష్ యాదవ్, దాసరి నరేష్ తదితరులు పాల్గొని దీక్షను విజయవంతం చేశారు. చివరిగా పగడాల కోదండ, పగడాల రమేష్ మాట్లాడుతూ – ఆదోని జిల్లా సాధనమే తమ అంతిమ లక్ష్యమని, ఆ లక్ష్యం సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: