Wednesday, 04 November 2026 01:22:41 PM
# ఆదోనిలో స్వప్న నాయకర్ సంచలన విజయం.. టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు షాక్.. # చిల్లర ఇవ్వలేదని మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన కేసులో చికిత్స పొందుతూ కండక్టర్ మృతి..!! # దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లకు సుప్రీం కోర్ట్ గుడ్ న్యూస్...✍️ # ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న న్యాయకర్ విజయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం.. # సొంత ఖర్చులతో యూరప్ టూర్‌కు భారత షట్లర్లు..!! # మానవత్వం చాటిన కానిస్టేబుల్ దీప..!! # మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!!

వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా సైనికులతో డా. బొత్సా అనూష ఆత్మీయ సమావేశం.

Date : 10 February 2026 10:53 AM Views : 238

DNB News - ఆంధ్రప్రదేశ్ / : చీపురుపల్లి: వైఎస్ఆర్ సీపీ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా సైనికులతో సోమవారం గరివిడి వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో పార్టీ మాజీ మంత్రి వర్యులు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్సా సత్యనారాయణ ,జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) సూచనలు మేరకు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యువనాయకురాలు డా. బొత్సా అనూష ఆత్మీయ సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో వైఎస్ఆర్ సీపీని మరింత బలోపేతం చేయడం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు,భవిష్యత్తు కార్యాచరణపై ఆమె దిశానిర్దేశం చేశారు.సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని,మహిళలను కించపరిచే వ్యాఖ్యలు, అసభ్య పదజాలం ఉపయోగించ కుండా సంయమనం పాటించాలని సూచించారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేలా సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలన్నారు. ప్రజలకు,రైతులకు, విద్యార్థులకు అధికార పార్టీ నాయకులు చేస్తున్న నష్టాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని డా. బొత్సా అనూష సూచించారు.ఈ సందర్భంగా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం ప్రెసిడెంట్ గా ఎల్. ప్రభాత్ కుమార్, చీపురుపల్లి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడుగా యర్రా శ్యామ్ సుందర్ రావు, గుర్ల మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడుగా మంత్రి పైడినాయుడు, గరివిడి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడుగా గవిడి పాపారావు,మెరకముడిదాం మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడుగా లోపింటి శంకరావులను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గరివిడి ఎంపీపీ మీసాల విశ్వేశ్వర రావు వైఎస్ఆర్ సీపీ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు వై. వాసు నాయుడు, జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు కెల్ల సురేష్, జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ శాసపు ప్రకాష్, సోషల్ మీడియా విభాగంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: