Friday, 18 September 2026 07:48:42 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

కార్యకర్తల గౌరవమే నా లక్ష్యం: కర్నూలులో గుడిసె ఆది కృష్ణమ్మ ప్రమాణ స్వీకారం

Date : 06 February 2026 10:28 AM Views : 164

DNB News - ఆంధ్రప్రదేశ్ / : నా ప్రమాణ స్వీకారం కేవలం ఒక హోదా స్వీకారం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పట్ల, స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆశయాల పట్ల చేసిన ప్రజా ప్రమాణం” అని నూతన బాధ్యతలు స్వీకరించిన గుడిసె ఆది కృష్ణమ్మ పేర్కొన్నారు. గురువారం కర్నూలులో భారీ ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఆమె తన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడుచుకుంటూ తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడమే తన తక్షణ లక్ష్యమని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. అహర్నిశలు శ్రమించే కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని పేర్కొన్నారు. అన్యాయంపై ప్రశ్నించడం తన నైజమని, కార్యకర్తల గౌరవాన్ని కాపాడటమే తన మొదటి ప్రాధాన్యత అని ఆది కృష్ణమ్మ తెలిపారు. ఇక నుంచి కర్నూలు జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ స్వరం మరింత గట్టిగా వినిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఆదోని నియోజకవర్గ ఇన్‌చార్జ్ కె. మీనాక్షి నాయుడు, ఎమ్మెల్యేలు డాక్టర్ పార్థసారథి (ఆదోని), కేఈ శ్యాంబాబు (పత్తికొండ), బొగ్గుల దస్తగిరి (కోడుమూరు), బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి (ఎమ్మిగనూరు) తదితర ముఖ్య నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మరియు భారీ సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: