DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ (GST) అమలు సమన్వయంపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జీఎస్టీ అమలు సమర్థవంతంగా కొనసాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పన్ను వసూళ్లలో పారదర్శకత, విధుల నిర్వహణలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని జీఎస్టీ అమలులో ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. సంబంధిత అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించబడింది.
Admin
DNB News