DNB News - తెలంగాణ / : స్థానిక గుట్టల బజార్ ప్రాంతంలో గల మాంట్ ఫోర్ట్ హైస్కూల్, ప్రిన్సిపాల్ బ్రదర్ జాన్ పాల్ గారి మార్గదర్శకత్వంలో విద్యార్థులకు డ్రగ్స్ మరియు నార్కోటిక్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీ.ఐ. వి. విజయ రామ్ కుమార్, (సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ - ఈగల్ ఫోర్స్ డిపార్ట్మెంట్ - తెలంగాణ) విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి సమాజంలో యువత మాదకద్రవ్యాల బారిన పడి తమ విలువైన జీవితాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని మరియు భవిష్యత్తును కోల్పోతున్నారని , డ్రగ్స్, నార్కోటిక్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాలను విద్యార్థులకు ఉదాహరణలతో వివరించారు. ఎవరైనా మాదకద్రవ్యాలు అందించినా లేదా వాటి వినియోగానికి ప్రోత్సహించినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, క్రీడలు మరియు విద్యపై దృష్టి సారించి, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తైన యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు "డ్రగ్స్‌కు నో... ఆరోగ్యకరమైన జీవితానికి యెస్" అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బ్రదర్ జాన్ పాల్, స్కూల్ స్టాఫ్ మరియు విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
DNB News