Friday, 18 September 2026 08:19:38 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు

Date : 06 April 2026 10:37 AM Views : 84

DNB News - తెలంగాణ / : చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు స్వాతంత్ర్య సమరయోధుడు,నవభారత నిర్మాత,మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ గారి జయంతిని పురస్కరించుకుని ఈ రోజు జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జగ్జీవన్‌రామ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్ 1908లో బీహార్ రాష్ట్రంలోని ఒక పేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి దేశ అత్యున్నత పదవులను అధిష్టించిన మహనీయుడని కొనియాడారు.చిన్నతనం నుండే సమాజంలో ఉన్న కుల వివక్షకు,అంటరానితనానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఆయన,విద్యనే ఆయుధంగా మలచుకుని అన్యాయాలపై పోరాడారని పేర్కొన్నారు. స్వతంత్ర భారత తొలి క్యాబినెట్‌లో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగ్జీవన్‌రామ్ గారు కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలను అమలు చేసినట్లు ఎస్పీ వివరించారు.బాబు జగ్జీవన్‌రామ్ గారి జీవితం ఒక తెరిచిన పాఠశాల వంటిదని,సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎస్పీ అన్నారు.ఆయన ఆశయాలకు అనుగుణంగా సమానత్వం,సోదరభావం కలిగిన సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని ఎస్పీ పిలుపునిచ్చారు.అణగారిన వర్గాల అభ్యున్నతికి,దేశ సమగ్రతకు కృషి చేయడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొంటూ,మాతృదేశ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,వన్ టౌన్ సీఐ కరుణాకర్,ఎంటిఓ సుధాకర్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఎస్సైలు ప్రవీణ్,రవి,రామకృష్ణ,మనీషాలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: