Saturday, 31 October 2026 03:01:45 AM
# జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం # హైదరాబాద్ లో 25KGల బ్యాగులో 22 KGల బియ్యం..!! # ఉద్యోగానికి ఎంపికై ఆరు నెలలు అయినా నియామక ఉత్తర్వులు ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం..!! # 20 వేల లంచం.. లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, పెట్రోల్ బంక్ టెక్నీషియన్ అరెస్ట్..!" # ఢిల్లీ వేదికగా 12వ బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సు..!! # రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం..!! # రేషన్ లబ్ధిదారులకు మరో 6 నిత్యావసరాలు..? # రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకమైనవని... మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. # సైనిక్ పురిలో ఈ-సిగరెట్ల ముఠా గుట్టురట్టు..!! # హైదరాబాద్లో ఆల్ ఇండియా పోలీస్ T20 క్రికెట్ టోర్నీ..!!

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకమైనవని... మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

Date : 28 October 2026 02:51 PM Views : 25

DNB News - తెలంగాణ / : ఖమ్మం మమత వైద్య విద్యా కళాశాల నందు ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్స్ అందరు బాధ్యతాయుతంగా ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ ఎన్నికల ద్వారా ప్రభుత్వం మారుతుందా లేదా అనేది కాకపోయినా పట్టభద్రులు తమ అభిప్రాయాలను, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తమ మనసులోని మాటలను ఈ ఓటు ద్వారా వ్యక్తపరిచే మంచి అవకాశమని తెలిపారు. ప్రస్తుత సమాజంలో, ముఖ్యంగా ఆనాడు కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని, ఆ సమయంలో వైద్య రంగానికి చెందిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, మరియు ఆనాడు ప్రభుత్వం అందించిన సేవలు ఎంతో మంది ప్రాణాలను కాపాడాయని గుర్తుచేశారు. ఈ ఎన్నికల సమయంలో ఓటర్లు, పట్టభద్రులు తమ కుటుంబసభ్యులలో ఎవరైనా అర్హత ఉండి ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, రాష్ట్రంలో జరుగుతున్న మంచి చెడులను గమనించి విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మమత సంస్థల డైరెక్టర్ పువ్వాడ నరేన్ రాజ్, ప్రిన్సిపాల్ అనురాధ,సూపరింటెండెంట్ రామస్వామి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :