Tuesday, 03 November 2026 12:19:11 PM
# ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!! # తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు..!! # తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..!! # హైదరాబాద్ లో అక్కడ ఫ్రీ WiFi.. ఫుల్ స్పీడ్..!! # నల్గొండ క్రాస్ రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్..!! # డ్రైవింగ్ లైసెన్స్.. ఇక NO టెన్షన్..!! # పెరుగుతున్న అరాచకాలు.. సినిమాల్లో హింస ఓక కారణమా..? # బురఖాలో వచ్చి చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్..!!

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

Date : 11 April 2026 04:16 PM Views : 110

DNB News - తెలంగాణ / : 450 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం – నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు- జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) కింద పంపిణీ అయ్యే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై జిల్లా యంత్రాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమన్వయ దాడుల్లో మొత్తం 450 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శనివారం తెల్లవారుజామున సుమారు 1.45 గంటల సమయంలో సివిల్ సప్లై అధికారులు, పోలీస్ విభాగం కలిసి నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో భాగంగా ఇల్లెందు మండలం రేపల్లెవాడలోని కోట మైసమ్మ గుడి సమీపంలో అక్రమంగా వాహనాలకు ఎక్కిస్తున్న 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక లారీ, ఒక బొలెరో వాహనాలను కూడా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు అదేవిధంగా టేకులపల్లి మండలంలో మరో ఘటనలో సుమారు 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రానికి తరలించే ప్రయత్నంలో ఉన్న లారీని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి మళ్లించేందుకు యత్నించినట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు తెలిపారు. ఈ రెండు ఘటనలపై సవివర విచారణ కొనసాగుతోందని, సంబంధిత నిందితులపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (TSPDS) కంట్రోల్ ఆర్డర్ నిబంధనలు మరియు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని అదనపు కలెక్టర్ తెలిపారు . ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని దారి మళ్లించడం అత్యంత తీవ్రమైన నేరమని, ఇందులో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లాలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతర తనిఖీలు, దాడులు కొనసాగుతాయని తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, సివిల్ సప్లై అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై సమాచారం అందించేందుకు ముందుకు రావాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :