DNB News - తెలంగాణ / : గత 35 ఏళ్లలో భద్రతా రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆయుధాలతో పాటు డ్రోన్లు, ఏఐ, సైబర్ భద్రత కీలకంగా మారాయని తెలిపారు. భద్రతా సిబ్బంది క్రమశిక్షణ, వివేకం, బాధ్యతతో ప్రజల్లో భరోసా కల్పించాలన్నారు. పండుగలు, సెలవులు వదులుకుని ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్న సిబ్బందికి, వారికి అండగా నిలుస్తున్న కుటుంబ సభ్యులకు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు..!!
Admin
DNB News