Sunday, 02 August 2026 08:20:31 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

జనవరి 26న రైతు–కార్మిక సమస్యలపై మోటార్ సైకిల్ ర్యాలీ

Date : 24 January 2026 01:57 PM Views : 98

DNB News - తెలంగాణ / : రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 26న మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక ధర్మ బిక్షం భవనంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, ఏఐకేఎఫ్ రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్నలు మాట్లాడారు. విత్తన చట్టం, విద్యుత్ బిల్లు, విబిజీ రామ్ జీ పథకం, నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ, కార్మిక రంగాల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని, వాటి పరిష్కారంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతుల అప్పులు, ఆత్మహత్యలు ఆగడం లేదని, దీనికి ప్రభుత్వాల ద్వంద విధానాలే కారణమన్నారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఎస్‌కేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి, నల్ల చట్టాలను దొడ్డి దారిన తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రైతాంగం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 26న నిర్వహించే మోటార్ సైకిల్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఏఐకేఎఫ్ రాష్ట్ర నాయకుడు ఎస్‌కే నజీర్, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, కెవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరసయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :