DNB News - తెలంగాణ / : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై పెళ్లిళ్లు, దావత్‌లు లేదా ఇతర కార్యక్రమాలకు సంబంధం లేని వ్యక్తులు ఫంక్షన్ హాల్లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ మేరకు ఫంక్షన్ హాల్స్ వద్ద ప్రత్యేక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా హాల్లోకి వచ్చిన వారు పట్టుబడితే మూడు నెలల జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశముందని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇటీవల ఫంక్షన్లకు సంబంధం లేకుండా వచ్చి భోజనం చేయడం, హాల్లో గందరగోళం సృష్టించడం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అతిథుల భద్రత మరియు కార్యక్రమాల సజావుగా నిర్వహణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని ఫంక్షన్ హాల్ యాజమాన్యాలు వెల్లడించాయి.
Admin
DNB News