Wednesday, 16 September 2026 12:22:23 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

సైబర్ మోసానికి గురైన కౌన్సిలర్ భర్త

Date : 09 March 2026 10:13 AM Views : 104

DNB News - తెలంగాణ / : సంగారెడ్డి జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపింది. సదాశివపేట పట్టణంలో బీజేపీ కౌన్సిలర్ భర్త సైబర్ నేరగాళ్ల వలలో పడిపోయి లక్షల రూపాయలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట పట్టణంలోని 14వ వార్డు బీజేపీ కౌన్సిలర్ ఉమారాణి భర్త ఉల్లిగడ్డల నాగన్నకు మొబైల్ ఫోన్‌కు ఓ లింక్ వచ్చింది. అది మున్సిపల్ కార్యాలయం నుంచి వచ్చినదిగా భావించి ఆయన ఆ లింక్‌ను ఓపెన్ చేశారు. అనంతరం ఎలాంటి ఓటీపీ రాకుండానే ఆయన బ్యాంక్ ఖాతా నుంచి మూడు విడతలుగా మొత్తం రూ.7 లక్షల 79 వేల రూపాయలు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో షాక్‌కు గురైన నాగన్న తాను సైబర్ మోసానికి గురైనట్టు గుర్తించి వెంటనే సదాశివపేట పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయకూడదని, వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :