Sunday, 02 August 2026 08:30:30 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

సిపిఎం పార్టీ కలకోవ గ్రామశాఖ ఆధ్వర్యంలోఘనంగాదక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య"41వ వర్ధంతి వేడుకలు

Date : 22 May 2026 11:00 AM Views : 61

DNB News - తెలంగాణ / : మునగాల:దక్షిణభారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య,జీవితం నేటి తరానికి ఆదర్శం అని సీపీఎం పార్టీ మండలకార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. మంగళవారం రాత్రి మండల పరిధిలోని కలకోవ గ్రామంలో అమరవీరుల సంస్మరణ భవనంలో పార్టీనాయకులు అనంతు గుర్వయ్య, అధ్యక్షుతన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ మండలకార్యదర్శి బుర్రి శ్రీరాములు హాజరై మాట్లాడారు. అనంతరం పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన పుచ్చలపల్లి సుందరయ్య పేదప్రజలు, వ్యవసాయ కూలీలు, కార్మికుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఎంపీగా ఉండి సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లి రాజకీయాల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప మహనీయుడని కొనియాడారు.భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య అగ్ర భాగాన ఉండి సాయుధ పోరాటాన్ని నడిపారన్ని అన్నారు. వందలాది ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య ప్రజల కోసం తనకు వారసత్వంగా వచ్చిన వందలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి ఇచ్చి, జీవితాంతం నిరాడంబర జీవితాన్ని గడిపారని కొనియాడారు. 1934 వ సంవత్సరంలో తన సొంత గ్రామం నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అలగానిపాడు లో వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి,వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపిన మహా యోధుడు సుందరయ్య అని కొనియాడారు. పార్లమెంటుకు, శాసనసభకు సైకిల్‌పై వెళ్లేవారన్నారు. సమాజమే త‌న‌ పిల్లలు అనుకుని తాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. నేడు ఎంతోమంది రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తున్నారని, విలువలను మరిచి అక్రమ సంపాదనకు, పదవి వ్యామోహంతో డబ్బు కోసం పార్టీలు మార్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. నేటి యువత సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జూలకంటి విజయలక్ష్మి,సైదా, సర్పంచ్ మండవ వెంకటాద్రి, సుంకర పిచ్చయ్య,శాఖకార్యదర్శులు కాసాని ముత్తయ్య, పడిసిరి నరసింహారావు, శీను, ప్రజానాట్యమండలి కళాకారుచే అమరవీరుల స్మృతి గీతాలు ఆలపించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :