Friday, 18 September 2026 08:12:10 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి : ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు కనకం సూరిబాబు

Date : 22 May 2026 10:47 AM Views : 160

DNB News - తెలంగాణ / : -దేశంలో ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దారుణమని ఐఎన్‌టీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కనకం సూరిబాబు మండిపడ్డారు. వారం రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను దాదాపు నాలుగు రూపాయల వరకు పెంచడం పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయమని ఆయన విమర్శించారు. ఇంధన ధరలు పెరగడం అంటే కేవలం వాహనదారులపై భారం పడటమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రభావితమవుతుందని అన్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం మరింత భారంగా మారుతోందన్నారు. ముఖ్యంగా రోజువారీ ఆదాయంపై ఆధారపడి జీవించే ఆటో కార్మికులు, డ్రైవర్లు, కార్మిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. డీజిల్ ధరల పెంపుతో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది మరింత భారంగా మారిందన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతులపై అదనపు భారం మోపడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి కార్పొరేట్ అనుకూల విధానాలతో ముందుకు సాగుతోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్‌పై అధిక పన్నులు విధించడం ద్వారా ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని విమర్శించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆవేదనను కేంద్రం గుర్తించకపోతే రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని కనకం సూరిబాబు హెచ్చరించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: