Wednesday, 17 June 2026 03:47:01 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన పైనంపల్లి గ్రామ నివాసి గట్టిగుండ్ల లక్ష్మీ ప్రసాద్.

Date : 05 March 2026 04:40 PM Views : 281

DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లా, తిరుమల పాలెం మండలం, పైనంపల్లి గ్రామానికి చెందిన, లక్ష్మి ప్రసాద్. గట్టిగండ్ల తెలంగాణ రాష్ట్రా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికయ్యారు. గత రెండున్నర సంవత్సరాలుగా మూఢనమ్మకాల నిర్మూలన కోసం లక్ష్మి ప్రసాద్ విశేషంగా కృషి చేస్తున్నారు. వివిధ రాష్ట్రంలో, అనేక జిల్లాలలో పర్యటించారు. సౌత్ ఇండియాలో తమిళనాడు చెన్నై, మహారాష్ట్ర ముంబై, కర్ణాటక బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం విజయవాడ, తెలంగాణ మరియు రాయలసీమ లల్లో లక్ష్మి ప్రసాద్ అలుపెరగని బాటసారిగా తిరుగుచూ మూఢనమ్మకాల నిర్మూల సంఘానికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. ప్రకృతి దర్శనం కార్యక్రమాలు నిర్వహించారు కులాంతర మతాంతర దండల పెళ్లిలను సమన్వయం చేశారు. మూఢనమ్మకాల సంఘటనలు జరుగుతాయో అక్కడికి తను వేగంగా స్పందిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కూకట్ పల్లిలో మ్యాజిక్ శిక్షణ పూర్తి చేసుకున్న లక్ష్మి ప్రసాద్ సంఘం ఆద్వర్యంలో జరిగిన కూకట్ పల్లి, ఉండవల్లి, మోకిల్లా, చేవెళ్ల లలో జరిగిన శిక్షణా తరగతుల్లో క్రియాశీలకపాత్ర పోషిస్తూ వాటికి నాయకత్వం వహించారు. గత సెప్టెంబర్లో ముంబైలో జరిగిన జాతీయ మహాసభలలో కమిటీ సభ్యులుగా, సంఘం నిర్మాణంలో, విస్తరణలో కార్యక్రమాల నిర్వహణలో క్రియాశీలకంగా పని చేసి తెలంగాణ రాష్ట్ర సహాయక కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రెండు సంవత్సరాల పాటు తాను ఈ భాద్యతలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు డా. బైరి నరేష్ సుజాత టీచర్ లు తనకు శుభాకాంక్షలు తెలిపారు. సహాయక కార్యదర్శి గా ఎన్నికైన సందర్బంగా లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ మన ప్రధాన లక్ష్యం మూఢనమ్మకాలను నిర్మూలించడం ప్రజలను చైతన్యపరచడం దానికోసం మరింత అంకితభావంతో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని తెలియజేశారు. తనపై నమ్మకం తో ఇంత బాధ్యతా యుతమైన పదవిని నాకు అప్పజెప్పి ప్రోత్సహిస్తున్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులకు లక్ష్మి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు ప్రజాసంఘాల వారు ఆ గ్రామ ప్రజలు గట్టిగుండ్ల. లక్ష్మి ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: