Saturday, 01 August 2026 08:07:58 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం..

Date : 25 April 2026 11:04 AM Views : 66

DNB News - తెలంగాణ / : మన జనాభా గణన మన అభివృద్ధి అనే నినాదంతో జనాభా గణన 2027కు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన ఫ్లెక్సీలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌ వద్ధ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ జనాభా గణన దేశంలో అతిపెద్ద ప్రజల భాగస్వామ్య కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రతి ఇంటి సమాచారం నమోదు చేసుకోవడం అందరి ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేశారు. ప్రజలంతా పెద్ద ఎత్తున ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. జనాభా గణన తొలి దశ మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ దశలో ఎన్యూమరేటర్లు ఇండ్ల జాబితా, గణన చేపడతారని వివరించారు. దీనికి ముందు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వీయ గణన (సెల్ఫ్ ఏనుమేరేషన్ ) చేయాలని సూచించారు. దీనికోసం (సే .సెంసుస్ .గవర్నమెంట్ .ఇన్ ) వెబ్‌సైట్‌ను సందర్శించి స్వీయ గణన ఐడి పొందాలని తెలిపారు. అనంతరం ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ఆ ఐడిని తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు, సందర్శకులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనాభా గణన విజయవంతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి రాం దత్తా రెడ్డి, జిల్లా సెన్సస్ అధికారి తిరుపతి పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: