DNB News - తెలంగాణ / : బరఖత్ గూడెం లోని వెంకటేశ్వర ఆలయం ఉత్తర ద్వారం కలిగి ఉంది చారిత్రాత్మక మైందని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురు వారం ఆలయం లో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం లో డీఎస్పీ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్మాత్మిక కార్య క్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. పండుగలన్నీ ప్రజల సుఖ సంతోషాలకు అనాదిగా వస్తున్నాయన్నారు. పండుగల సంస్కృతి సంప్రదాయాలను మరిచి పోవద్దన్నారు. పరాభ నామ సంవత్సరం ప్రజలకు విజయాలు సాధించి పెట్టాలన్నారు. ప్రజలకు నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, దేవాలయం చైర్మన్ శ్రీనివాస్, ఆలయ పూజారి, స్థానిక భక్తులు ఉన్నారు.
Admin
DNB News