Sunday, 02 August 2026 09:50:55 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో ఇన్ఫోసిస్ ఫ్రీ ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ఓరియంటేషన్ విజయవంతం

Date : 23 February 2026 07:11 PM Views : 99

DNB News - తెలంగాణ / : కరీంనగర్‌లోని ఎస్ ఆర్ ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో విద్యార్థుల భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని “ఇన్ఫోసిస్ ఫ్రీ ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ఓరియంటేషన్” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ మరియు ఐబీమ్ సంస్థల సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, అలాగే ఏఐ–రోబోటిక్స్ రంగాల్లో ఉన్న జాబ్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ శిక్షకుడు శ్రీ పి. అశోక్ మాట్లాడుతూ, ఇన్ఫోసిస్ సంస్థ అందిస్తున్న ఉచిత శిక్షణా కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్ వంటి ఆధునిక రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమ ప్రతిభను అభివృద్ధి చేసుకుంటే దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతమైన అవకాశాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ మాట్లాడుతూ, నేటి తీవ్రమైన పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీ సాధించడం సరిపోదని, కాలేజీ విద్యతో పాటు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన స్కిల్ ఆధారిత కోర్సులు పూర్తి చేయడం అత్యవసరమని అన్నారు. విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. మెరీనా పెయింట్స్ కంపెనీ డైరెక్టర్ జి. పవన్ తమ సంస్థలో ఉన్న వివిధ స్థాయిల ఉద్యోగ అవకాశాలను వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే యువతకు విశాలమైన భవిష్యత్తు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టీ ఎస్ కె సి కోఆర్డినేటర్ డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు ఇంటర్న్‌షిప్ అవకాశాలను వినియోగించుకొని ప్రాక్టికల్ అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. ఇది భవిష్యత్ ప్లేస్మెంట్స్‌లో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ డాక్టర్ హర్జోత్ కౌర్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం, డేటా అనలిటిక్స్, సాఫ్ట్ స్కిల్స్ వంటి అంశాల్లో దిట్ట కావడం ద్వారా విద్యార్థులు గ్లోబల్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వివరించారు. కెరీర్ గైడెన్స్ కోఆర్డినేటర్ కె. సుధాకర్ మాట్లాడుతూ, కాలేజీ చదువుతో పాటు స్కిల్ ఆధారిత కోర్సులు పూర్తిచేసి స్వయం ఉపాధి, స్టార్టప్‌లు, డిజిటల్ సర్వీసుల ద్వారా స్వతంత్రంగా ఎదగవచ్చని తెలిపారు. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వినియోగించి నూతన అవకాశాలను సృష్టించుకోవాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధి అవకాశాలకు దోహదపడేలా నిర్వహించిన ఈ ఓరియంటేషన్ సదస్సు విజయవంతంగా ముగిసింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: