DNB News - తెలంగాణ / : వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం లో రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక్కొక్క రైతు కొనుగోలు కేంద్రాల వద్ద 50 రోజుల పైగా పడిగాపులు పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని, రైతు పండించిన ధాన్యాన్ని ఆయా రాష్ట్రాల ద్వారా కేంద్రమే కొనుగోలు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటో వివరించాలన్నారు. రైతులు ఆగ్రహంతో పార్టీలతో సంబంధం లేకుండా రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని, రాబోయే వర్షాకాలంలోపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని చివరి గింజ వరకు వెంటనే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో తమ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
Admin
DNB News