Saturday, 01 August 2026 10:36:55 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం… ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

Date : 07 March 2026 11:38 AM Views : 91

DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదాశివపురం గ్రామానికి చెందిన ఎండ్రాతి విశాల్, జిల్లపల్లి జస్వంత్, కొంగర గ్రామానికి చెందిన పొట్ట ఆకాష్ నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో వీరు సింగారెడ్డిపాలెంలోని గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసి బైక్‌పై నేలకొండపల్లికి తిరిగి వస్తున్నారు. ఇదే సమయంలో కోరట్లగూడెం గ్రామానికి చెందిన బచ్చలకూరి అభినవ్ (జానీ), అమ్మగూడెం గ్రామానికి చెందిన వాసంశెట్టి ఉదరు, ఆరెగూడెం గ్రామానికి చెందిన బోయిన ఉదరు అనే ముగ్గురు విద్యార్థులు నేలకొండపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసి తమ స్వగ్రామాలకు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో సింగారెడ్డిపాలెం కొరటేనే గుట్ట మూలమలుపు వద్దకు చేరుకునే సరికి కూసుమంచి వైపు నుంచి వస్తున్న కారును తప్పించబోయి ఒక బైక్ నియంత్రణ కోల్పోయింది. దీంతో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడంతో రెండు బైకులపై ఉన్న ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో గాయపడిన విద్యార్థులను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండల వైద్యాధికారి డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఒకే ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు గాయపడటంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ పి. సంతోష్, తహసీల్దార్ వి. వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఎం. ఎర్రయ్య తమ సిబ్బందితో కలిసి ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :