DNB News - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐకెపి, VOA ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఐదు రోజులుగా చేస్తున్నారు. వేములవాడ రూరల్, అర్బన్ మండలాల ఆధ్వర్యంలో తెలంగాణ ఐకెపి వీఓఏ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు వేములవాడ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరవధిక సమ్మెకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఓఏలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ వీఓఏలకు కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తమను ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఓఏలకు సీసీ లుగా పదోన్నతులు కల్పించాలని, సాధారణ మరియు ఆరోగ్య భీమా కింద రూ.20 లక్షల వరకు భద్రత కల్పించాలని కోరారు. అదేవిధంగా యూనిఫాం, నెట్ సౌకర్యాలు అందించడంతో పాటు 58 జీవోను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Admin
DNB News