Sunday, 02 August 2026 11:57:50 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఆకుపాముల గ్రామ నివాసి లిక్కి కృష్ణంరాజు వారి కుమారుడు లిక్కి వర్షిత్ సాహస యాత్ర విజయవంతం

Date : 12 April 2026 09:50 AM Views : 64

DNB News - తెలంగాణ / : మునగాల మండల ఆకుపాముల గ్రామ నివాసి అయిన శ్రీ లిక్కి కృష్ణంరాజు (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మల్కాజ్గిరి కమిషనరేట్), వారి కుమారుడు లిక్కి వర్షిత్ (8వ తరగతి విద్యార్థి) , రాజుల శ్రీనివాస్ గారు (కృష్ణంరాజు బావగారు) మరియు కొమురబండ, ఆకుపాముల గ్రామ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయులు శ్రీ మల్లెబోయిన సత్యనారాయణ గారు నలుగురు కలిసి 2026 మార్చి 28వ తేదీ నుండి 14 రోజులపాటు నేపాల్ దేశంలోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (5434 మీటర్ల ఎత్తు) ను ట్రెక్కింగ్ ద్వారా విజయవంతంగా చేరుకొని, ఈరోజు స్వదేశానికి తిరిగి వచ్చి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. వారి ఈ సాహస యాత్ర పట్ల మునగాల మండల ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండలంలోని యువత మరియు ప్రజలు వీరి యాత్రను ఆదర్శంగా తీసుకుని, ఇలాంటి సాహస యాత్రల్లో పాల్గొనాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. వారి యాత్ర వివరాలు వారి మాటల్లోనే ఇలా ఉన్నాయి: హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుండి ఎయిర్ ఇండియా విమానంలో కాఠ్మాండు (త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం) కు చేరుకుని, అక్కడి నుండి వాహనం ద్వారా రామేఛాప్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుండి చిన్న విమానం ద్వారా లుక్లా విమానాశ్రయానికి చేరుకొని,(ప్రపంచంలో అతి చిన్న రన్వే కలిగిన విమానాశ్రయం) అక్కడి నుండి ట్రెక్కింగ్ ప్రారంభించి 7 రోజుల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో 3 రోజుల్లో లుక్లాకు చేరుకుని, అక్కడి నుండి తిరిగి కాఠ్మాండు ద్వారా భారతదేశానికి వచ్చారు. ఈ యాత్రలో 5434 మీటర్ల ఎత్తుకు చేరడం, మైనస్ 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం, అక్కడి ఆహారం మరియు జీవన విధానాన్ని అనుభవించడం వంటి అనేక కొత్త అనుభూతులను పొందినట్లు వారు తెలిపారు. జీవితం అనేది ఒక ప్రయాణమని, ఇలాంటి యాత్రలు మనిషికి అమూల్యమైన అనుభవాలను, జ్ఞానాన్ని అందిస్తాయని వారు పేర్కొన్నారు. చివరిగా, “జీవితం అంటేనే ఒక ప్రయాణం” అని మనందరం గుర్తుంచుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: