DNB News - తెలంగాణ / : నడిగూడెం మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-07 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం జరిగింది. చిన్ననాటి మిత్రులంతా ఒక చోటుకు చేరి, తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.అలాగే యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఉద్యోగాలు, వివిధ రంగాల్లో స్థిరపడిన వారంతా 20 ఏళ్ల తర్వాత కలిశారు.ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులకు శాలువా కప్పి,జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాటి గురువులు,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
DNB News