DNB News - తెలంగాణ / : బండి సంజయ్ ను భుజంపై ఎత్తుకుని ఊరేగించిన కాషాయ దళం ‘‘ఈరోజు నాకు పట్టలేని సంతోషం ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్కక్కై ఎన్నో కుట్రలు చేసింది. ఓటుకు రూ.7 వేలు ఇచ్చాయి. చివరకు బీజేపీ అభ్యర్థులకు, నాయకులను ప్రలోభ పెట్టేదుకు అనేక కుట్రలు చేసింది. పాచిక పారలేదు. అయినా సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బడే భాయ్ ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ ను పిలిచి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మ లేదు. తెలంగాణలో తొలిసారి కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేసి రికార్డు స్రుష్టించాం.’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘‘కరీంనగర్ తీర్పు స్పూర్తితో భాజాప్త చెబుతున్నా.... హైదరాబాద్ పై కాషాయ జెండా ఎగరేయబోతున్నాం.’’అని చెప్పారు. ‘‘ఒవైసీ కళ్లల్లో ఆనందం చూసేందుకు రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి ఒక ముక్క ఒవైసీకి రాసిచ్చారు. అదే రేవంత్ రెడ్డి పాలిట మరణ శాసనం కాబోతోంది. హైదరాబాద్ తోపాటు సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరేయబోతున్నం. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? అని ఎదురు చూస్తున్నాం’’అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావుసహా స్థానిక బీజేపీ నేతలతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే... మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండాను ఎగరేయడం చాలా గొప్ప విషయం. ఈ అద్బుత అవకాశాన్ని మాకు అందించి మోదీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ సంతోషం పట్టలేనిది. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని కలిసికట్టుగా పనిచేశాం. జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మార్గదర్శకత్వంలో మోదీగారి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాం. బండి సంజయ్ హిందుత్వమే మాట్లాడతారు. అభివ్రుద్ధి మాట్లాడరు. కరీంనగర్ కు నయాపైసా కూడా తేలేదంటూ పిచ్చి కూతలు కూసిన వాళ్లకు చెంప పెట్టు తీర్పు ఇచ్చారు. కర్రు కాల్చి వాతపెట్టారు. కరీంనగర్ ప్రజలను ఆదుకునేది, అభివ్రుద్ధి చేసేది మోదీ ప్రభుత్వమేనని నమ్మి ఆదరించారు. 5 ఏళ్లలో కరీంనగర్ అభివ్రుద్ధి ఏ విధంగా చేస్తామో చేతల్లో చూపిస్తాం... కరీంనగర్ అభివ్రుద్దికి రూ.1500 కోట్లు మోదీ ప్రభుత్వం ఖర్చు చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నయాపైసా ఇయ్యలేదు. ప్రజలు బేరీజు వేసి ఆశీర్వదించారు. నేను ఒక సామాన్య కార్యకర్తను. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన. రెండుసార్లు కార్పొరేటర్ గా గెలిచిన. రెండుసార్లు ఎంపీగా గెలిచిన. బీజేపీ నాయకత్వం నాకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇఛ్చారు. కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించింది ఈరోజు నాకు పట్టలేని సంతోషం ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్కక్కై ఎన్నో కుట్రలు చేసింది. ఓటుకు రూ.7 వేలు ఇచ్చాయి. చివరకు బీజేపీ అభ్యర్థులకు, నాయకులను ప్రలోభ పెట్టేదుకు అనేక కుట్రలు చేసింది. పాచిక పారలేదు. అయినా సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బడే భాయ్ ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ ను పిలిచి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మ లేదు. కరీంనగర్ ప్రజలు బీజేపీనే నమ్మారు. నరేంద్రమోదీపై విశ్వాసంతోనే కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తుందనే నమ్మకంతో... మోదీని చూసి బీజేపీకి ఓటేసి గెలిపించారు. ఇప్పుడు 30 సీట్లు గెలిచినం. కొన్ని కారణాలవల్ల మరో 3గురికి సీట్లు ఇవ్వలేకపోయినా కాషాయ జెండా కప్పుకుని తిరిగి గెలిచారు. మరో 3 గురు ఇండిపెండెంట్లు వస్తున్నారు. అందరూ షాక్ తినేలా ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు కూడా బీజేపీలోకి రాబోతున్నరు. మాజీ మేయర్ సునీల్ రావు కు ఫోన్ చేసి బీజేపీకి మద్దతిస్తామని స్వచ్ఛందంగా చెబుతున్నారు. వారందరి సహకారం తీసుకుంటాం. అభివ్రుద్ధే లక్ష్యంగా అందరినీ కలుపుకుపోతాం. కరీంనగర్ ఎంఐఎం కాంగ్రెస్ తో సంసారం చేస్తోంది. బీఆర్ఎస్ కు కన్ను కొట్టింది. ప్రజలు గమనించారు. గతంలో 7 సీట్లున్న ఎంఐఎంను 3 సీట్లకే పరిమితం చేశారు. ఎంఐఎం పార్టీ కార్యాలయ డివిజన్ లో ఆ పార్టీని బద్దలు కొట్టినం. ఎంఐఎం కు ఆదరణ ఉన్న కాశ్మీర్ గడ్డ వంటి ప్రాంతాల్లోనూ బీజేపీ సత్తా చాటాం. గతంలో ఎంఐఎం అరాచకాలు చాలా చేసింది. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసింది. వాళ్ల షాపులను, ఇండ్లను ధ్వంసం చేసినా భయపడలేదు. ధైర్యంగా వాళ్లు పోరాడారు. ఇయాళ వారి పోరాటాలు, త్యాగాలు ఫలించాయి. మొత్తం 66 డివిజన్లలో సర్వే చేసి 56 మందికి కట్టర్ బీజేపీ కార్యకర్తలకే సీట్లు ఇచ్చినం. ఇయాళ 33 మంది గెలిచారు. 100 ఓట్లలోపు తేడాతో మరో 10 మంది బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. భాజాప్త చెబుతున్నాం... బరాబర్ గెలిచినం. ఇదంతా ప్రజల ఆశీర్వాదం. ప్రజలకు మోదీపట్ల ఉన్న ప్రేమ, విశ్వాసమే కారణం. కరీంనగర్ స్పూర్తితో జీహెచ్ఎంసీపైనా కాషాయ జెండాను ఎగిరేస్తాం. హైదరాబాద్ ను మూడు ముక్కలు చేసి జీహెచ్ఎంసీని రేవంత్ రెడ్డి ఒవైసీ కళ్లల్లో ఆనందం మజ్లిస్ కు రాసిచ్చారు. కాంగ్రెస్ కు అదే మరణ శాసనం కాబోతోంది. సవాల్ చేసి చెబుతున్నాం... బాజాప్తా చెబుతున్నం... హైదరాబాద్ లోని మూడు కార్పొరేషన్లలో కాషాయ జెండాను ఎగరేయబోతున్నాం. కాషాయ కార్యకర్తలంతా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? అని ఎదురు చూస్తున్నాం. కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్. బీజేపీ అభ్యర్థులను ఆదరించిన కరీంనగర్ ప్రజలకు హ్యాట్సాఫ్... నేను మహాశక్తి అమ్మవారిని నమ్ముకున్న. సేవ చేసే అవకాశం కల్పించాలని మొక్కుకున్నా. ఆ తల్లి ఆశీర్వాదం ఈ గెలుపుకు ప్రధాన కారణం. అమ్మవారి దయతో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా కేంద్ర నిధులతో అభివ్రుద్ధి చేసి చూపిస్తాం. కరీంనగర్ కార్పోరేషన్ ను ప్రక్షాళన చేస్తాం. ప్రజల వద్దకే పాలనను తీసుకెళతాం. పార్టీని నమ్ముకుని, చెప్పిన మాట విని నామినేషన్లను ఉపసంహరించుకుని పనిచేసిన బీజేపీ నాయకులకు భవిష్యత్తులో మంచి అవకాశాలిస్తాం.
Admin
DNB News