Friday, 18 September 2026 04:28:32 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

తలసేమియా చిన్నారులకు 'ఎర్రని' భరోసా

Date : 09 May 2026 10:41 AM Views : 73

DNB News - తెలంగాణ / : • ‘లైట్ అప్ రెడ్’కు విశేష స్పందన * ఎరుపు రంగు విద్యుత్ కాంతుల్లో వెలిగిపోయిన ఖమ్మం * చిన్నారుల కోసం రక్తదానం చేసిన తుమ్మల యుగంధర్, డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఖమ్మం: తలసేమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు మేమంతా ఉన్నామంటూ ఖమ్మం నగరం గొంతు కలిపింది. టీఎస్ సీఎస్ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఇచ్చిన పిలుపుతో ఖమ్మం నగరం ఎరుపు రంగు విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. ‘లైట్ అప్ రెడ్’ కార్యక్రమంలో భాగంగా శుక్ర, శనివారాల్లో రాత్రి వేళల్లో తలసేమియా చిన్నారులకు భరోసాగా నిలిచేందుకు పలు భవనాలు ఎరుపు వెలుగులు విరజిమ్మాయి. * ఎరుపు రంగు విద్యుత్ కాంతుల్లో భవనాలు ఖమ్మంలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం, డాక్టర్ కూరపాటి చిల్డ్రన్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, టీఎస్ సీఎస్ బిల్డింగ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల భవనాలు ఎరుపు రంగు విద్యుత్కాంతులతో తలసేమియా చిన్నారులకు మేము సైతం భరోసాగా నిలుస్తాం అంటూ వెలుగులు విరజిమ్మాయి. * ఆత్మీయంగా వేడుకలు.. ప్రపంచ తలసేమియా దినోత్సవ వేడుకలను తలసేమియా సొసైటీలో డాక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన ఆటపాట, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోగా, ‘ఖమ్మం టెడ్డి టీం’ చిన్నారులతో కలిసి ఆడిపాడి వారిని అలరించారు. * రక్తదానంతో స్ఫూర్తి ప్రపంచ తలసీమియా వేడుకల్లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో తుమ్మల యుగంధర్, డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ స్వయంగా రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. వీరితో పాటు ‘యువం ఫౌండేషన్’ సభ్యులు సుమారు 50 మంది యువకులు రక్తదానం చేశారు. తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా డాక్టర్ ప్రదీప్ కుమార్ తలసేమియా చిన్నారుల కోసం చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని అన్నారు. చిన్నారులకు ఉచిత వైద్యం అందించడంతో పాటు, రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రతి నెలా రక్తాన్ని అందిస్తూ వారికి ఆత్మబంధువుగా నిలిచారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో నేను కూడా ప్రతి ఏడాది రక్తదానం చేస్తానని ప్రకటించారు. ఖమ్మం నుండే మొదటి అడుగు వేసేలా ప్రభుత్వం హెచ్‌బీ ఏ2 పరీక్షలు నిర్వహించే విధంగా కృషి చేస్తానన్నారు. అతిథులు ఖమ్మం ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రెహనా బేగం, సెక్రటరీ డాక్టర్ కోటేశ్వరరావు, ట్రెజరర్ డాక్టర్ కూరపాటి ప్రీతి మాట్లాడుతూ తలసేమియా బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. డాక్టర్ ప్రదీప్ కుమార్ చేస్తున్న విశిష్ట సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎస్ సీఎస్ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సనాఉల్లా,డాక్టర్ సిద్ధార్థ్, వాలంటీర్లు నరేష్, అభిషేక్, మల్లేష్ , నజీర్, మోతిలాల్, సిరాజ్ ,సుచరిత,లక్ష్మి, సుగుణ, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :