Saturday, 31 October 2026 03:01:29 AM
# జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం # హైదరాబాద్ లో 25KGల బ్యాగులో 22 KGల బియ్యం..!! # ఉద్యోగానికి ఎంపికై ఆరు నెలలు అయినా నియామక ఉత్తర్వులు ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం..!! # 20 వేల లంచం.. లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, పెట్రోల్ బంక్ టెక్నీషియన్ అరెస్ట్..!" # ఢిల్లీ వేదికగా 12వ బ్రిక్స్ పార్లమెంటరీ సదస్సు..!! # రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం..!! # రేషన్ లబ్ధిదారులకు మరో 6 నిత్యావసరాలు..? # రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకమైనవని... మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. # సైనిక్ పురిలో ఈ-సిగరెట్ల ముఠా గుట్టురట్టు..!! # హైదరాబాద్లో ఆల్ ఇండియా పోలీస్ T20 క్రికెట్ టోర్నీ..!!

20 రూపాయల???? వాటర్ బాటిల్ వివాదంలో నల్గొండ సాయికుమార్ ను విజయవాడలో కొట్టి చంపిన యువకులు

Date : 23 October 2026 03:49 PM Views : 34

DNB News - తెలంగాణ / : *వాటర్ బాటిల్ ఖరీదు 20 రూపాయలు. అవును..అతను ఆ 20 రూపాయల వాటర్ బాటిల్ ను దొంగతనం చేయటానికి ప్రయత్నించాడంట.. దొంగతనం జరగలేదు.. దొంగతనానికి ప్రయత్నించాడు అనే నెపంతో.. నల్గొండ జిల్లాకు చెందిన 33 ఏళ్ల సాయికుమార్ ను అత్యంత దారుణంగా కొట్టి చంపారు. పెళ్లాం.. ముగ్గురు పిల్లలు ఉన్నారని కన్నీళ్లతో వేడుకున్నా కనికరం లేకుండా కొట్టారు. అసలు ఇక్కడ దొంగతనమే జరగలేదు.. దొంగతనానికి ప్రయత్నించాడు అనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘోరం జరిగింది ఏపీ రాజధాని ఏరియా విజయవాడలో. విజయవాడ సిటీ నడిబొడ్డున జరిగిన ఈ ఘోరం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కలకలం రేపుతోంది. ఈ పూర్తి వివరాల్లోకి వెళితే.. *నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన 33 ఏళ్ల మాస సాయికుమార్. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పని చేస్తూ ఉన్నాడు. వారం రోజుల క్రితం విశాఖపట్నం వెళుతున్నట్లు చెప్పి.. పని చేసే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు సెలవు పెట్టాడు. ఆ తర్వాత మూడు రోజుల క్రితం భార్యపిల్లలకు ఫోన్ చేసి విజయవాడలో ఉన్నానని చెప్పాడు. భార్యకు ఫోన్ చేసిన తర్వాత విజయవాడ సిటీలోని పడమట డొంక రోడ్డులోని ఓ లిక్కర్ షాపు దగ్గర ఉన్న పాన్ షాపులోని ఫ్రిజ్ నుంచి సాయికుమార్ వాటర్ బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న పాల వ్యాన్ డ్రైవర్ చూశాడు. అతను షాపులో పని చేసే వ్యక్తికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వాటర్ బాటిల్ దొంగతనానికి ప్రయత్నించింది ఇతనే అంటూ సాయికుమార్ ను వాళ్లకు చూపించి వెళ్లిపోయాడు పాల వ్యాన్ డ్రైవర్. *ఆ తర్వాత సాయికుమార్ ను తన అదుపులోకి తీసుకున్న పాన్ షాపులో పని చేసే శివ శంకర్ తన విశ్వరూపం చూపించాడు. ఎలా పడితే అలా కొట్టాడు. కొట్టటమే కాదు సాయికుమార్ ను ఈడ్చుకుంటూ వైన్ షాపు వెనక ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లాడు. అక్కడ తనతోపాటు బార్ లో పని చేసే అయ్యప్ప శంకర్ తోడయ్యాడు. వీళ్లిద్దరూ కలిసి సాయికుమార్ ను కరెంట్ స్థంభానికి కట్టేసి కర్రలతో కొట్టారు. వీళ్లిద్దరూ కొట్టటం చూసిన పోతంశెట్టి నవీన్, సాయి ప్రణీత్ అనే మరో ఇద్దరు అక్కడికి వచ్చారు. అడ్డుకోవాల్సిన వీళ్లిద్దరూ అడ్డుకోకపోగా.. రవిశంకర్, అయ్యప్ప శంకర్ తో కలిసి సాయికుమార్ ను కర్రలతో కొట్టారు. ఈ నలుగురు రెండు గంటలు కొడుతూ బీభత్సం చేశారు. *ఈ క్రమంలోనే బాధితుడు సాయికుమార్ కన్నీళ్లతో వేడుకున్నాడు. నాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.. నేను చనిపోతే వాళ్లు అనాధలు అవుతారు.. నన్ను వదిలేయండి.. నేను వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు ఇస్తానని వేడుకున్నాడు. వాటర్ బాటిల్ కాజేయాలనే ప్రయత్నం కాదని.. ఫ్రిజ్ లో నుంచి తీసుకుని.. మీరు వచ్చిన తర్వాత డబ్బులు ఇద్దామని అనుకున్నానని.. దొంగతనం కాదంటూ వాళ్లను వేడుకున్నాడు సాయికుమార్. అయినా ఏ మాత్రం వినలేదు ఆ నలుగురు. కరెంట్ స్థంభానికి కట్టేసి.. విచక్షణారహితంగా కొడుతూ నవ్వుకున్నారు. 2 గంటల తర్వాత సాయికుమార్ స్పృహ కోల్పోయాడు. భయపడిన ఆ నలుగురు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న సాయికుమార్ ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు. *ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాలు పరిశీలించగా చనిపోయిన సాయికుమార్ పై ఆ నలుగురు దాడి చేసినట్లు స్పష్టం అయ్యింది. కేసు నమోదు చేసి ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు పటమట పోలీసులు..!!

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :