Saturday, 19 September 2026 07:25:58 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

చర్మకార కులంలో పుట్టిన వజ్రం గురు సంత్ రవిదాస్

చర్మకారుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తా చర్మకారుల సంఘం జిల్లా అధ్యక్షులు చదలవాడ సూరి

Date : 02 February 2026 11:33 AM Views : 107

DNB News - తెలంగాణ / : సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప మేధావి సంత్‌ గురు రవిదాస్‌ మహరాజ్‌ అని చర్మకారుల సంఘం జిల్లా అధ్యక్షులు చదలవడా సూరి అన్నారు. ఆయన మార్గం అందరికీ అనుసరణీయమని పేర్కొన్నారు. సంత్‌ రవిదాస్‌ 650వ జయంతి వేడుకలు ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని చర్మకారుల సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చదలవాడ సూరి .. సంత్‌ రవిదాస్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చర్మకార కులంలో పుట్టిన వజ్రంగా సంత్‌ రవిదాస్‌ను అభివర్ణించారు. మానవతా సుగంధాన్ని విరజిమ్మే కవితోద్యమం ఆయన సొంతమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగాలని, మనుషులంతా ఒక్కటేనన్న సమానత్వ సందేశాన్ని 14వ శతాబ్దంలోనే ఇచ్చిన సంత్‌ రవిదాస్‌ గొప్ప మహానుభావుడని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సైతం సంత్‌ రవిదాస్‌ను అనుసరించినట్టు చరిత్ర చెప్తున్నదన్నారు. సంత్‌ రవిదాస్‌ సేవా మార్గాన్ని రాష్ట్రంలో విస్తృత పరుస్తామని చెప్పారు. చర్మకారుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో చర్మకారులకు సంఘం గౌరవ సభ్యులు దాసరి సంజీవ్, పెద్దపూడి రాము, భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి పెట్టల సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దపూడి నాగేంద్రబాబు, చర్మకారుల సభ్యులు బాబు, ప్రసాద్, శ్రీను, రాజేష్, ప్రభు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :