DNB News - తెలంగాణ / : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ HM బాధ్యతలు విస్మరించారని తల్లిదండ్రులు మండిపడ్డారు. మేడిపల్లి కమలనగర్ PM శ్రీ MPPS HM భాస్కర్ మద్యం మత్తులో విధులకు వస్తూ విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. తరగతి గదినే పడకగదిగా మార్చుకుని టేబుల్‌పై కాళ్లు పెట్టుకుని నిద్రిస్తున్నారని వాపోయారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్, DEOకు ఫిర్యాదు చేశారు..!!
Admin
DNB News