DNB News - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు నగరంలోని ఇందిరా చౌక్‌తో పాటు పలు ప్రాంతాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తో పాటు పలువురు నాయకులతో కలిసి కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసినారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “మా నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రతి కార్యకర్తకు ‘అన్నా’ అని పిలిస్తే ‘నేను ఉన్నా’ అని పలికే దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినాన్ని నగరంలోని దాదాపు 70 ప్రాంతాల్లో కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు మంత్రిగా సేవలందించి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ రాష్ట్రానికి కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. తన తండ్రి శ్రీపాదరావు బాటలో నడుస్తూ తండ్రికి తగ్గ తనయునిగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాం” అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ.. “శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మంత్రిగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవ చేసేందుకు భగవంతుడు ఆయనకు మరెన్నో గొప్ప పదవులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు. ఎస్ ఆర్ ఆర్ కాలేజీ గ్రౌండ్ లో కాంగ్రెస్ నేత వీర దేవేందర్ ఆధ్వర్యంలో వాకర్స్ అసోసియేషన్ తో కలిసి కేక్ కట్ చేసి రాగి జవా పంపిణీ చేసారు, అంబేద్కర్ స్టేడియంలో గుడిపాటి రమణ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియం వాకర్స్ కేక్ కట్ చేసారు, పాలిటెక్నిక్ వెటర్నరీ కాలేజీ గ్రౌండ్ లో స్థానిక కార్పొరేటర్ వరాల నర్సింగం తో కలిసి వెటర్నరీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసారు, కార్పొరేటర్ పడిశెట్టి వసంత భూమయ్య ఆధ్వర్యంలో కోతి రాంపూర్ లోని లోని గిద్దెపెరుమాళ్ళ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు , S C సెల్ నాయకులు జీడి రమేష్ ఆధ్వర్యంలో కోర్ట్ సర్కిల్ లో కేక్ కట్ చేసారు, గాంధి రోడ్డులోని వృద్ధులు వికలాంగుల ఆశ్రమంలో అసంపల్లి వాసు ఆధ్వర్యంలో పండ్లు పంపిణి చేసారు, కరీంనగర్ బస్టాండ్ ఎదుట ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు పోతారపు సురేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణి చేసారు, మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో కరీముల్లాషా దర్గలో మైనారిటీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి పూల చదర్ సమర్పించారు, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నాగుల సతీష్ ఆధ్వర్యంలో కమన్ వద్ద అన్నదాన కార్యక్రమం చేసారు, మైనారిటీ వైస్ చైర్మన్ కలియుముద్దీన్ ఆధ్వర్యంలో కశ్మీర్ గడ్డలోని రైతు బజార్ వద్ద కేక్ కట్ చేశారు. పై కార్యక్రమాలలో నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, కర్ర రాజశేఖర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, వంగల విద్యాసాగర్, నాగుల సతీష్, చర్ల పద్మ, కొట్టే ప్రభాకర్, మామిడి సత్యనారాయణ రెడ్డి, నిహాల్, దిండిగాల మధు, వేల్పుల వెంకటేష్, గోపు మల్లారెడ్డి, కంరుద్దీన్ బషీరుద్దీన్, గంగుల దిలీప్, అమీర్, అబ్దుల్ బారి, ఫజల్, మాదాసు శ్రీనివాస్, బొబ్బిలి విక్టర్, కుంభాల రాజకుమార్, జొన్నల రమేష్, షబానా, వరదాల లింగమూర్తి, మూల కృష్ణారెడ్డి, హస్త పురం రమేష్, గ్రూపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, హస్త పురం తిరుమల, జమీల్ ఖాన్, శిల్ప, తోట అంజయ్య, మాలోతు మహాలక్ష్మి, నూనె గోపాల్ రెడ్డి, స్వప్న శ్రీ, హైమద్, అజ్మత్, కూన దామోదర్, పోరండ్ల రమేష్, లాయక్, గడప శ్రీనివాస్, జి ఎస్ ఆనంద్, బషీరుద్దీన్, ఖలీముద్దీన్, అందశంకర్, జ్యోతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News