DNB News - తెలంగాణ / : ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా, సిఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎస్‌ఐ రామ్‌నాథ్ నేతృత్వంలో నిన్న రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా బొలెరో వాహనం నడుపుతున్న భీమ్ సింగ్ (తండ్రి: ఫాబుదెన్, వయస్సు 31 సంవత్సరాలు)ను బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించగా, మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్టు నిర్ధారణ అయింది. ఈ కేసును విచారించిన ఆదోని I అదనపు జెఎఫ్‌సిఎం న్యాయస్థానం, ముద్దాయికి 30 రోజుల (ఒక నెల) జైలు శిక్ష విధించింది. న్యాయస్థాన ఆదేశాల మేరకు ముద్దాయిని ఈరోజు ఆదోని సబ్ జైలుకు తరలించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Admin
DNB News