Monday, 03 August 2026 09:25:53 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Date : 04 March 2026 10:29 AM Views : 85

DNB News - తెలంగాణ / : మైనర్ బాలికను అపహరించి ఆరు నెలల పాటు నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే… దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన షేక్ నసీర్ అలియాస్ అహ్మద్ (35), స్వస్థలం వికార్‌బాద్ జిల్లా, ప్రస్తుతం దుండిగల్ నివాసి, 2021 అక్టోబర్ 29న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉన్న మైనర్ బాలికను బెదిరించి అపహరించాడు. బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె తండ్రి అక్టోబర్ 30న దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, క్రైమ్ నం. 1016/2021గా సెక్షన్ 363 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో నిందితుడు బాలికను ముంబైకు తీసుకెళ్లి సుమారు ఆరు నెలల పాటు ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 376(2)(n), 344, 506తో పాటు పోక్సో చట్టం సెక్షన్ 5(l) r/w 6లను చేర్చారు. నిందితుడిని 11.05.2022న అరెస్ట్ చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి కింది విధంగా శిక్ష విధించింది. పోక్సో చట్టం సెక్షన్ 5(l) r/w 6 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా. ఐపీసీ సెక్షన్ 363 కింద 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా. ఐపీసీ సెక్షన్ 344 కింద 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా. ఐపీసీ సెక్షన్ 506 కింద 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా. అదనంగా బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పోక్సో కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు, సాక్ష్యాధారాల సమగ్ర సమర్పణతో నిందితుడికి కఠిన శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులను డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి అభినందించారు. మహిళలు, బాలికల భద్రతకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. – డీసీపీ క్రైమ్స్, సైబరాబాద్.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: