DNB News - తెలంగాణ / : లోక్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరియు బీసీ సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై గవర్నర్‌తో మంత్రి చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రవాణా శాఖకు సంబంధించిన కార్యక్రమాలపై కూడా గవర్నర్‌కు మంత్రి వివరాలు అందించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు గవర్నర్ అభినందనలు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ భేటీ మర్యాదపూర్వక సమావేశంగా జరిగింది.
Admin
DNB News