DNB News - తెలంగాణ / : మునగాల:నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు బుధవారం కోదాడ లో ఘనంగా నిర్వహించారు. మహానాడు కోఆర్డినేటర్లు ముత్తినేని సైదేశ్వర రావు, ఓరుగంటి ప్రభాకర్ ల ఆధ్వర్యంలో వర్చువల్ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఈ మహాసభకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తెదేపా శ్రేణులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం సభలో లైవ్ స్క్రీన్ల ద్వారా అధినాయకత్వ సందేశాన్ని కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పట్ల నేటికీ ప్రజల్లో ఏమాత్రం అభిమానం తగ్గలేదని,రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింతగా పోరాడుతామన్నారు. నాయకులు సభా వేదిక పైకి తరలివచ్చి ఐక్యతను చాటుతూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దామని జై తెలుగుదేశం, జై చంద్రబాబు, ఎన్టీఆర్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈసమావేశంలో సాగర్ ఇన్చార్జి మువ్వ అరుణ్ కుమార్, హుజూర్నగర్ మండవ వెంకటేశ్వర్లు, చాగంటి వెంకటేశ్వరరావు, జడ రాములు, కొల్లు సత్యనారాయణ,భయ్యా నారాయణ, కొల్లు నరసయ్య, సాతులూరి గురవయ్య, బండ్లమూడి వెంకటేశ్వరరావు, గుండు నాగేశ్వరరావు, పిట్టల శోభన్ బాబు, కోలా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News