DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గంలోని డాణాపురం గ్రామంలో గురువారం ఆదొని శాసనసభ్యులు డా. పీవీ పార్థసారథి వాల్మీకి రైతులతో మమేకమై వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. పొలంలోకి స్వయంగా దిగి రైతులతో కలిసి సాలు పట్టి విత్తనాలు నాటి వ్యవసాయం పట్ల తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అన్నదాత కష్టానికి తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. వ్యవసాయం మన సంస్కృతికి మూలాధారమని, రైతు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు పొలం రైతు హనుమంతు, వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్, రైతులు హుస్సేన్, చాకలి మారెమ్మ, పద్మ, సౌరమ్మ, శేఖమ్మ, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
DNB News