Thursday, 17 September 2026 04:35:55 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ – 76 వాహనాలు స్వాధీనం, 1000 లీటర్ల నాటు సారా ధ్వంసం..

Date : 08 March 2026 01:04 PM Views : 129

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌ను విస్తృతంగా నిర్వహించారు. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ ఆదేశాల మేరకు, ఈగల్ ఐజి శ్రీ ఏకే రవి కృష్ణ ఐపిఎస్ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్‌లలో ఈ తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ మెగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది కలిపి మొత్తం 240 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి వాహనాలు మరియు అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించారు. మొత్తం 870 మంది వ్యక్తులను మరియు 345 వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 76 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 35 లిక్కర్ బాటిల్స్‌ను సీజ్ చేసి ఒక బైండ్ ఓవర్ కేసు నమోదు చేశారు. అక్రమంగా తయారు చేస్తున్న 1000 లీటర్ల నాటు సారా బెల్లం ఊటను మరియు 300 లీటర్ల నాటుసారాను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని పోలీసులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా, కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు ఇంచార్జ్ డిఎస్పీ ఉపేంద్రబాబు, సిఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :