Sunday, 02 August 2026 10:30:45 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

రాయ్‌పూర్, బిలాయ్‌లో వెల్లివిరిసిన తెలుగుదనం: కళింగ ఆత్మీయ సమ్మేళనం ఘనవిజయం

Date : 09 February 2026 05:34 PM Views : 168

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాయ్‌పూర్: "కళింగం అంటే కేవలం ఒక ప్రాంతానికో, కులానికో పరిమితమైనది కాదు.. అది ఒక గొప్ప జాతి. ఆ మూలాలున్న వారంతా ఎక్కడున్నా ఒక్కటే" అని చాటిచెబుతూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నిర్వహించిన కళింగ ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఛత్తీస్‌గఢ్ తెలుగు వెల్ఫేర్ సొసైటీ, ఆంధ్రా సంఘం మరియు కళింగ సమాజ్ సంయుక్త ఆధ్వర్యంలో రాయ్‌పూర్, బిలాయ్ కేంద్రాలుగా జరిగిన ఈ వేడుకలు తెలుగువారి ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయి. ముఖ్య అతిథికి బ్రహ్మరథం ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య అతిథిగా హాజరైన ఆమదాలవలస ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ కూన రవికుమార్ కి స్థానిక తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రవికుమార్ మాట్లాడుతూ, తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ ఆత్మీయతను మరువలేనని భావోద్వేగానికి లోనయ్యారు. కళింగ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గౌరీ శంకర్ వ్యాఖ్యలు ఈ సందర్భంగా చతిస్గడ్ కళింగ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గౌరీ శంకర్ మాట్లాడుతూ, “ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి కూన రవికుమార్ చతిస్గడ్ రావడం మా అదృష్టం. కళింగ సమాజంపై ఆయనకు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం. మా ఆహ్వానాన్ని గౌరవించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు. రాయపూర్ కళింగ సంఘం అధ్యక్షుడు సనపల జగదీష్ రావు ప్రశంసలు రాయపూర్ కళింగ సంఘం అధ్యక్షుడు సనపల జగదీష్ రావు మాట్లాడుతూ, “స్థానిక రమణ స్కూల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. కళింగ జాతికి పెద్దదిక్కులా నిలుస్తున్న కూన రవికుమార్ , ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశంలో ఎక్కడ కళింగులు పిలిచినా హాజరవ్వడం ఆయనకు కళింగులపై ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం” అని కొనియాడారు. కళింగ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై మార్గదర్శకత్వం అందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు హాజరవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రమణ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు కూడా రవికుమార్‌ను ఘనంగా సత్కరించారు. కళింగ సంఘం ప్రధాన కార్యదర్శి హిమగిరి వ్యాఖ్యలు కళింగ సంఘం ప్రధాన కార్యదర్శి హిమగిరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కూన రవికుమార్ ఛత్తీస్ ఘడ్ పర్యటనకు తాను చేసిన ప్రయత్నాలను వివరించడంతో పాటు, ఆయన వచ్చిన నాటి నుంచి వెళ్లే వరకు అన్ని కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ఘనంగా సన్మానించారు. చతిస్గడ్‌లో నివసిస్తున్న కళింగులు, తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా సంఘం అధ్యక్షుడు జి. స్వామి అభ్యర్థనలు ఆంధ్రా సంఘం అధ్యక్షుడు జి. స్వామి మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కూన రవికుమార్ రాయపూర్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు సమాజం తరపున ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిడుల అంశంపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించాలని కోరుతూ, ఆంధ్రా సంఘం తరపున కూన రవికుమార్‌ను ఘనంగా సత్కరించారు. TWS అధ్యక్షుడు టి. గోపి వ్యాఖ్యలు TWS అధ్యక్షుడు టి. గోపి మాట్లాడుతూ, “తెలుగు, కళింగ సంఘాల ఆహ్వానాన్ని మన్నించి కూన రవికుమార్ రావడం మాకు గర్వకారణం. రానున్న రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలకు హాజరై తెలుగువారికి అండగా నిలవాలి” అని కోరారు. ఈ సంద‌ర్భంగా కూన ర‌వికుమార్‌ను TWS తరపున ఆయనకు ప్రత్యేక సన్మానం చేశారు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం కీలక సూచనలు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం మాట్లాడుతూ, కూన రవికుమార్ రాయపూర్ రావడం ఎంతో ఆనందంగా ఉందని, “ఉదయం ఎనిమిది గంటల నుంచే ఆయన కోసం ఎదురుచూశాం” అని తెలిపారు. రాయపూర్‌లో గతంలో ఉన్న టీటీడీ కౌంటర్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే చతిస్గడ్‌లో నివసిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల తెలుగు ప్రజలకు రిజర్వేషన్లు గుర్తించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్య అతిధి కూన ర‌వికుమార్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: * తెలుగు భాషా బంధం: ఖండాంతరాలు దాటినా, రాష్ట్రాలు దాటినా మనల్ని కలిపేది 'తెలుగు' అనే నినాదమేనని, అది మనందరికీ జీవన పథమని ఆయన పేర్కొన్నారు. * డెమోగ్రాఫిక్ ఇన్‌బ్యాలెన్స్ (జనాభా అసమతుల్యత): ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న జనాభా రేటుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 1995లో జనాభా నియంత్రణకు ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జనాభా పెంపు దిశగా ఆలోచన చేయాలని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. * సాంకేతికత - భవిష్యత్తు: అమరావతిలో ప్రపంచంలోనే తొలిసారిగా రాబోతున్న క్వాంటం కంప్యూటింగ్, 2026 నాటికి రానున్న సూపర్ కంప్యూటర్ గురించి ఆయన వివరించారు. భవిష్యత్తులో ఐటి రంగంలో వచ్చే 30-35 లక్షల ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా మన పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు సూచించారు. * సామాజిక ఐక్యత - మత మార్పిడులు: సమాజంలో ఉన్న వ్యత్యాసాలు, కొందరిని దూరం పెట్టడం వల్లే మత మార్పిడులు జరుగుతున్నాయని ఆయన విశ్లేషించారు. దళితులను, గిరిజనులను అక్కున చేర్చుకుని, వారి ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించి ఆత్మీయతను పంచాలని కోరారు. * రిజర్వేషన్ల సమస్య: కళింగులకు తెలంగాణలో ఎదురవుతున్న రిజర్వేషన్ సమస్యల గురించి ప్రస్తావిస్తూ, కేంద్ర-రాష్ట్ర స్థాయిల్లో ఏకీకృత రిజర్వేషన్ విధానం ఉండాలని, చట్టాల్లో మార్పులు రావాలని ఆకాంక్షించారు. ప్రత్యేక విన్నపం: రాయ్‌పూర్‌లో గతంలో ఉన్న టిటిడి (TTD) కౌంటర్‌ను మూసివేయడంపై స్థానికులు విన్నవించగా, ఈ విషయాన్ని ప్రభుత్వం మరియు టిటిడి బోర్డు దృష్టికి తీసుకువెళ్లి, కౌంటర్‌ను పునఃప్రారంభించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. > "కళింగ అనేది అంతరించిపోయే కులం కాదు.. సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిచి ఉండే ఒక గొప్ప జాతి." > — కూన రవికుమార్, ఎమ్మెల్యే అయ్యప్ప కమిటీ, షోలాపురి మఠ కమిటీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. > ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు మరియు స్థానిక కాలింగ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు తెలుగు సంఘాలకు సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు పాల్గొని కూన రవికుమార్కు జ్ఞాపికలతో సత్కరించి తమ ప్రేమను చూపించారు జగదీష్, గిరి తదితర ప్రముఖులు, పెద్ద సంఖ్యలో కళింగ మరియు తెలుగు సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :