Sunday, 02 August 2026 09:51:24 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ESI హాస్పిటల్ యథావిధిగా కొనసాగించాలి

Date : 10 April 2026 06:26 PM Views : 147

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈఎస్ఐ హాస్పిటల్‌ను ఇక్కడే యథావిధిగా కొనసాగిస్తూ, లబ్ధిదారులకు మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంబంధిత కార్పొరేషన్ అధికారులకు మరియు ఎమ్మెల్సీ బీటీ నాయుడు కి వినతిపత్రం సమర్పించారు. గతంలో రాయలసీమ ప్రాంతం నలుమూలల నుంచి కార్మికులు ఆదోనిలోని ఈఎస్ఐ హాస్పిటల్‌కు వచ్చి చికిత్స పొందేవారని తెలిపారు. అయితే, స్పిన్నింగ్ మిల్లులు మూతపడటం వల్ల కార్మికుల సంఖ్య తగ్గిందనే కారణంతో ప్రస్తుతం ఈ ఆసుపత్రిని కేవలం 10 పడకల ఆసుపత్రిగా పరిమితం చేయడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకులు తిప్పన్న, పీఎస్ గోపాల్, లక్ష్మన్న, అజీం ఖాన్ మాట్లాడుతూ, ఆదోనిలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, మున్సిపాలిటీ, షాపింగ్ మాల్స్ వంటి అనేక రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఈఎస్ఐ వర్తిస్తోందని తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. కావున, ప్రస్తుతం ఉన్న 10 పడకల ఆసుపత్రిని మరింత బలోపేతం చేసి, అవసరమైన డాక్టర్లను నియమించి, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్‌ను కర్నూలుకు తరలించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిఐటియు నాయకులు హెచ్చరించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: