DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణానికి నూతనంగా నియమితులైన మున్సిపల్ కమిషనర్‌ను జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్పన్న ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకుడు యం పులి రాజు ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్‌కు అభినందనలు తెలియజేసి, వారి నాయకత్వంలో ఆదోని పట్టణ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యాలు, పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో సమర్థవంతమైన సేవలు అందించాలని కోరారు. జనసేన పార్టీ తరఫున ప్రజల సంక్షేమం, పట్టణాభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు. అధికార పరిపాలన బాధ్యత కమిషనర్‌దేనని గుర్తుచేస్తూ, పార్టీ తరఫున పాలనలో నేరుగా హస్తక్షేపం ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ పి.ఎస్. జయరాం, మంచాలి రాజు, వాలేకర్ విజయ్, ఉరుకుందు, అంజి, వలి భాష తదితర స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News